నవవిధ శాంతులు అనగా (Navavidha shaanthulu):

నవవిధ శాంతులు అనగా (Navavidha shaanthulu):
నవవిధ శాంతులు అనగా :

1)  తైలావలోకనము :నూనెలో నీడ చూచుట మట్టి పాత్రలో తగినంత నువ్వుల నూనే పోసి అందులో పగడం,ముత్యం ఉంచి కళ్ళు ఉప్పు అనగా స్పటికము వలె ఉండాలి ఈ ఉప్పును గుట్ట గా పోసి అ ఉప్పు గుట్ట పై నునే పాత్రను ఉంచి ముందుగా గణపతి ని తరువాత నునే పాత్రను పూజించి ఆ తైలంలో ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి.

2)  రుద్రాభిషేకం : నక్షత్రం యొక్క దోషమును బట్టి నిర్వహించావలెను తగినంత మంది బ్రహ్మానులను నియమించుకొని రుద్రన్యాసయుక్తంగా 11 సార్లు శివాభిషేకము,పూజ జరిపించవలెను.బ్రాహ్మణులను బోజన తాంబూల దక్షనల చేత సత్కరించి ఆశ్సిస్సులు పొందవలెను.

3) సూర్య నమస్కారములు : ఒంటికాలిపై నిలిచి ఆరుణ మంత్రమును 108 పర్యాయములు జపించవలెను.

4) మృత్యుంజయ జపము : అప మృత్యు దోషము తొలగుటకై లక్ష సార్లు మృత్యుంజయ జపము జరిపించవలెను.

5) నక్షత్ర జపము :  ఒక్కో నక్షత్రమునకు 108 కాని 1008 సార్లు కాని శాంతి మంత్రమును జపము చేయించాలి.

6) నవగ్రహ జపము :  నవగ్రహములకు 9 మంది బ్రాహ్మణులచే ఆయా శాంతి నిర్నీత మంత్రములను జపించ వలెను.

7) హోమము : నవగ్రహముల పేరిట తగు హోమము చేయంచ వలెను.

8) సువాసినీ పూజ : శక్త్యాను సారము ముతైదువలకు బోజనము పెట్టి తాంబులాదులు పూవులు పండ్లు సమర్పించి నమస్కరించి ఆశిర్వచానాలు పొందాలి.

9) చిట్టచివరిది బ్రాహ్మణులకు సమారాధన చేయవలెను.

ఈ విధంగా జరిపించిన సర్వ నక్షత్ర గ్రహ దోషములు, అప మృత్యు భయములు తొలిగి శుభము పొంద గలరు.