Site icon Current Affairs in Telugu.com

కెనడా లో హిందువుల మీద దాడి- ఖలిస్తానీలు

canada president justin and india president modi face off,కెనడా లో హిందువుల మీద దాడి

కెనడా లో హిందువుల మీద దాడి చేసిన ఖలిస్తాని వాదులు

Hindus beaten at Canada temple by Khalistanis

కెనడా లోని brompton సిటీ లోని హిందూ గుడిలో ఖలిస్థాన్ జెండా పట్టుకొని కొంతమంది ఖలిస్థాన్ తీవ్రవాదులు చొరబడి హిందువుల మీద దాడి చేసారు,

వాళ్ళ చేతులలో ఉన్న ఖలిస్థాన్ జెండాలతో కొట్టడం వాటిని పక్కన పడేసి వారి మీద దాడి చేయడం చేసారు

ఈ దాడి లో ఒక మహిళా వారి పిల్లలు కూడా ఉన్నట్టు Hindu Canadian Foundation తెలియజేసింది

2024 నవంబర్ 3 తేదీన brompton సిటీ లోని హిందూ temple లో Indian Consulate పనులు జరుగుతున్నాయి దానికి వ్యతిరేకంగా ఖలిస్తాని వేర్పాటు వాదులు

టెంపుల్ కి బయట నిరసన తెలియజేస్తున్నారు ఆ నిరసనలలో హిందువులు కూడా భారతీయ జెండాలతో ఖలిస్థాన్ జెండాలను పట్టుకున్న వారికీ వ్యతిరేకంగా అరవడం మొదలు పెట్టారు

అందుకు ఖలిస్థాన్ వేర్పాటు వాదులు తిరిగి హిందువుల మీద దాడి చేయడం చేసారు

ఇండియన్ consulate అనేది కెనడా లో ఉంటున్న భారతీయులకు కెనడా వారికీ లోకల్ అండ్ life certificates ఇవ్వడం జరుగుతుంది అంటే భారతీయ అధికారులు దీన్ని అధికారికంగా నిర్వహిస్తారు ఇందులో సిక్కులు కూడా సర్టిఫికెట్ లు తీసుకుంటారు ఈ సర్టిఫికెట్లతొ అక్కడ పెన్షన్ పొందేవారు వారి పెన్షన్ ను రెన్యువల్ చేసుకుంటారు అలాంటి సభను లోకల్స్ రిక్వెస్ట్ మేరకు హిందూ టెంపుల్ లో నిర్వహించారు

దాన్ని అడ్డుకోవడానికి ఖలిస్థాన్ ఉగ్రవాదులు అక్కడికి వొచ్చి నిరసన తెలియజేసి హిందువుల మీద దాడి చేసారు

అయితే విచిత్రం ఏంటంటే వారిని కాపాడడానికి కెనడా పోలీసులను పిలిస్తే అక్కడ ఉన్న హిందువులను అరెస్ట్ చేశారు

దానికి సంబందించిన వీడియో లు ట్విట్టర్ లో పోస్ట్ చేసారు

ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం అని కెనడా ప్రెసిడెంట్ జస్టిన్ ట్రూడో ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు, ప్రతీ కెనడియన్ కి వారి సొంత మత విశ్వసాలను పాటించే హక్కు స్వేచ్ఛ ఉంది అని అన్నాడు

కానీ భారత్ కి వ్యతిరేకంగా ఖలిస్థాన్ ఉద్యమానికి పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నది కెనడా ప్రెసిడెంట్ జస్టిన్ ట్రూడో నే అని అందరికి తెలుసు ఎందుకంటే భారత్ నుండి సైబర్ ఎటాక్ జరిగే అవకాశం ఉంది అని మన భారత దేశాన్ని కెనడా సైబర్ ఎటాక్ చేసే దేశాల లిస్ట్ లో చేర్చింది

అయితే ఈ దాడి గురించి Jagmeet Singh అనే New Democratic Partyచీఫ్ కూడా దీన్ని ఖండించాడు కాకపోతే ఈయన కూడా ఖలిస్థాన్ ఉద్యమాన్ని పూర్తిగా సపోర్ట్ చేసే కెనడా సిక్కు నాయకుడు అందుకే ఈ దాడిలో పాల్గొన్న దుండగుల పేర్లు బయటకి చెప్పలేదు

కెనడా transport మినిస్టర్ గా పనిచేస్తున్న మొట్టమొదటి హిందూ MP, మినిస్టర్ అనితా ఆనంద్ ఈ చర్యను పూర్తిగా ఖండించారు
ఎ మతం వారికైనా వారి ప్రార్థనా స్థలాలకు వెళ్లే హక్కు ఉంది అని అక్కడ వారి మీద దాడి చేయడం సరైనది కాదు అని విమర్శించింది
ఆ సంఘటన జరుగుతున్నపుడు అక్కడ న్యాయం అమలు చేసే విదంగా పోలీసులు వ్యవహరించారు అని చెప్పడం జరిగింది

అంతే కాదు భారతీయ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీని ని చంపినందుకు Proud ఫీల్ అవుతున్నాం అని ఇలాంటి ప్లకార్డు లు బొమ్మలు పట్టుకొని ఖలిస్థాన్ తీవ్రవాదులు నిరసన చేస్తున్నారు దానికి సంబందించిన వీడియో చుడండి

 

అయితే కెనడా కి మన భారత్ కి ఈ మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి
దానికి కారణం ఖలిస్థాన్ వేర్పాటు వాదులు కెనడా లో నిరసనలు చేస్తూ భారత్ కి వ్యతిరేకంగా ఉగ్రవాదులను తయారుచేస్తుంది కొంతమందికి ట్రైనింగ్ కూడా ఇస్తుంది అని భారత్ రిపోర్ట్ చేసింది

అయితే కొంత మంది ఖలిస్థాన్ లీడర్లు కెనడా లో చంపబడ్డారు దానికి కారణం మన భారత ఇంటలిజెన్స్ అని కెనడా ఆరోపిస్తుంది
లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ కెనడా లో ఉన్న ఉగ్రవాదులను చంపుతుంది అని కెనడా పోలీసు లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది

ఈ విషయాన్నీ భారత్ పూర్తిగా వ్యతిరేకించింది కెనడా లో ఎలాంటి గూఢచర్యం చేయడం లేదు అని స్పష్టం చేసింది

అయితే కెనడా కూడా ఖలిస్థాన్ వేర్పాటు వాదులకు సపోర్ట్ చేసే విధంగా భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది

Exit mobile version