బాంగ్లాదేశ్ లో కరెంటు కట్ – అదానీ
Adani Power cuts electricity supply to Bangladesh over unpaid bills
బాంగ్లాదేశ్ లో కరెంటు కట్ చేసుకునే పరిస్థితికి వొచ్చిన మొహమ్మద్ యూనుస్ ప్రభుత్వం
నవంబర్ 7 వ తేదీ లోపు 850 million డాలర్ల డబ్బు చెల్లించకపోతే బంగ్లాదేశ్ లో కరెంటు Supply ఎట్టిపరిస్థితుల్లోను ఆపేస్తాం అని హెచ్చరించిన అదానీ పవర్ Jharkhand Limited (APJL)
జార్ఖండ్ లోని అదానీ కి సంబందించిన పవర్ ప్లాంట్ నుండి బాంగ్లాదేశ్ ప్రభుత్వం కరెంటు ను కొనుగోలు చేస్తుంది
అయితే దానికి సంబందించి 850 మిలియన్ డాలర్ల పేమెంట్ బాంగ్లాదేశ్ చేయాల్సి ఉంది అందుకు గాను బాంగ్లాదేశ్ ప్రభుత్వానికి October 27 న అదానీ పవర్ లెటర్ రాసింది,
అందులో 30 వ తేదీ లోపు బకాయిలు చెల్లించాలని గడువు పెట్టింది కానీ బాంగ్లాదేశ్ చెల్లించలేకపోయింది,
ఇప్పుడు మళ్ళి చివరి సారిగా ఆ తేదీను నవంబర్ 7 కు మార్చింది, ఈ సారి బకాయిలు చెల్లించకపోతే అదానీ పవర్ నుండి బాంగ్లాదేశ్ కి కరెంటు ను పూర్తిగా ఆపేస్తాం అని హెచ్చరించింది,
అదే గనక జరిగితే బాంగ్లాదేశ్ చీకట్లోకి వెళ్ళిపోతుంది అంతకుమించి అక్కడ వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తింటాయి, ఇండస్ట్రీ లు ఆగిపోతాయి,
కరెంటు బిల్ కట్టలేని పరిస్థితికి బాంగ్లాదేశ్ ఎందుకు వొచ్చింది అని అందరికి అనిపిస్తుంది,
కానీ దానికి కారణాలు మనం అనుకునేవి కాదు, అందులో గౌతమ్ అదానీ పాత్ర ఉంది
బాంగ్లాదేశ్ లో కరెంటు కట్ ?
రాజకీయంగా ప్రభుత్వ పరంగా బాంగ్లాదేశ్ ఇంకా కోలుకోలేదు, దాంతో పాటు బాంగ్లాదేశ్ లో జరిగిన రాజకీయ మార్పు, నిరసనలు,ఆస్థి నష్టం
ఇవన్నీ కలిసి బాంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితిని కుప్పకూలిపోయేలా చేసాయి దాంతో బంగ్లాదేశ్ కరెన్సీ విలువ పడిపోయింది,
అంటే ఒక బంగ్లాదేశీ టాకా విలువ ఇప్పుడు మన రూపాయితో 71 పైసలు గా ఉంది,
బాంగ్లాదేశ్ లో అల్లర్లు జరిగే సమయానికి అది 69 పైసలుగా ఉంది అలాగే అల్లర్లు జరగకముందు 75 పైసలు గా ఉండేది
దాంతో పాటు బాంగ్లాదేశ్ దగ్గర ఉన్న విదేశీ కరెన్సీ డాలర్ నిల్వలు తగ్గిపోయాయి
850 మిలియన్ డాలర్లు ఎందుకు ఉంది ?
మొదటి నుండి Bangladesh Power Development Board సమయానికి పేమెంట్ చేసేది కానీ 2024 జులై నుండి పేమెంట్ చేయడం తగ్గించింది దాంతో అదానీ పవర్ కూడా కరెంటు సప్లై ని తగ్గించింది,
అక్టోబర్ 30 వ తేదికి బాంగ్లాదేశ్ లో 1600 మెగావాట్స్ పవర్ కొరత ఏర్పడింది దాంతో వెంటనే ఆ రోజుకు ముందు అంటే అక్టోబర్ 29 వ తేదీన 16,477 మెగావాట్స్ కరెంటు ని బాంగ్లాదేశ్ ఉత్పత్తి చేసింది,
బాంగ్లాదేశ్ ఇంతపెద్ద మొత్తం లో కరెంటు ను generate చేయడం ఇదే మొదటి సరి అని బాంగ్లాదేశ్ పత్రిక Dhaka Tribune వెల్లండించింది
వెంటనే 850 మిలియన్ డాలర్ల డబ్బును కట్టాల్సిందిగా ఒత్తిడి పెట్టిన దాంట్లో భారత ప్రభుత్వ ప్రమేయం లేదు ఎందుకంటే
బాంగ్లాదేశ్ భారత్ లోకి ఒక ప్రైవేట్ కంపెనీ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ‘అదానీ పవర్’ నుండి కరెంటు ను కొంటుంది
దింట్లో ఇండియా govt చేసేది ఏం లేదు అని బాంగ్లాదేశ్ నాయకులు చెప్తున్నారు,
బాంగ్లాదేశ్ నాయకులు దీని మీద ఎం అంటున్నారు :
పవర్ బిల్ ను గత ప్రభుత్వం కారణంగానే కట్టడం లేదు అని షేక్ హసీనా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు
దాంతో పాటు నవంబర్ 7 లోపు బిల్లు కట్టాలని మాకు లెటర్ రాలేదు అని అయినా సరే బిల్ కట్టడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం అని Shafiqul బాంగ్లాదేశ్ మినిస్టర్ చెప్పడం జరిగింది.
బాంగ్లాదేశ్ పవర్ గ్రిడ్ చెప్పిన అసలు కారణాలు:క్లుప్తంగా
Bangladesh Power Development Board (PDB) చేస్తున్న వాదన ఏంటంటే ప్రతీ వారం 18 మిలియన్ డాలర్లు మేము కడుతున్నాం అని
కాకపోతే జులై నుండి అదానీ పవర్ ఇంతకుముందు ఇచ్చిన రేట్ కంటే ఎక్కువ ధరను పెంచింది దాంతో ఆ డబ్బు వారానికి 22 మిలియన్ డాలర్లు గా మారిపోయింది
దాని వల్ల జులై నుండి కట్టాల్సిన పేమెంట్ పెరుగుతూ పోయింది అంతే కాకుండా బాంగ్లాదేశ్ లో ఉండే కృషి బ్యాంకు లో వాళ్లకు సంబందించిన విదేశీ కరెన్సీ నిల్వలు తగ్గిపోయాయి అని తెలుస్తుంది
ఒకవేళ నవంబర్ 7లోపు బిల్లు కట్టకపోతే పవర్ సప్లై పూర్తిగా ఆపేస్తాం అని అదానీ power చెప్తుంది దింట్లో The Indian Ministry of External Affairs కూడా జోక్యం చేసుకోలేదు,
ఎందుకంటే ఇది పూర్తిగా బాంగ్లాదేశ్ కి ప్రైవేట్ కంపెనీ కి ఉన్న కాంట్రాక్టు
అయితే మన ఇండియా బాంగ్లాదేశ్ కి సహాయం చేయడానికి ఎప్పుడూ వెనుకాడదు ఈ సారి కూడా పవర్ బిల్లు ఇండియా తరపున కట్టే అవకాశాలు కూడా లేకపోలేదు
కానీ బాంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అక్కడ మైనారిటీ లు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు,
ఇలాంటి సమయం లో మన భారత ప్రభుత్వం ఎలాంటి సహాయం చేస్తుందో వేచి చూడాలి.