మోడీ పరివార్ లేక గాంధీ పరివార్ దేంట్లో ఉంటారో తేల్చుకోండి రేవంత్ రెడ్డి
నవంబర్ 11 న నేషనల్ ఎడ్యుకేషన్ రోజున హైదరాబాద్ లో జరిగిన సభ లో తెలంగాణ సీఎం కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసాడు
ప్రస్తుత భారత దేశం లో మోడీ కుటుంబం లేకపోతే గాంధీ కుటుంబం ఈ రెండు మాత్రమే నడుస్తున్నాయి అని వ్యాఖ్యానించాడు
వీళ్ళలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది మీ చేతిలోనే ఉంది ఒకవేళ మీరు మోడీ పరివార్ కి సపోర్ట్ చేస్తే
ముస్లిం లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 4% రిజర్వేషన్ ని తీసేస్తుంది కాబట్టి మోడీ పరివార్ లేక గాంధీ పరివార్ లో ఎవరి ఎంచుకుంటారో జాగ్రత్తగా ఎంచుకోవాలి అని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది
రంజాన్ సమయం లో వాళ్ళు మీతో కలిసి బిర్యానీ తింటారు మీతో కలిసి శర్వాని డ్రెస్ వేసుకుంటారు
దాన్ని నమ్మి మీరు వాళ్ళకి ఓట్ వేస్తే ఢిల్లీ లో వాళ్ళు మీకు వ్యతిరేకంగా మీ రిజర్వేషన్ ని మీ నుండి లాక్కుంటారు
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అన్ని మతాల వారిని సమానంగా చూస్తుంది సమన హక్కుల కోసం పోరాడుతుంది అని
తెలంగాణ కు హిందువులు ముస్లిం లు రెండు కళ్ళ వంటి వారు అని
మణిపూర్ లో క్రిస్టియన్ల మీద అరాచకాలు జరిగితే నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ కనీసం బాధితులను పరామర్శించడానికి వెళ్ళలేదు అని
కేవలం రాహుల్ గాంధీ మాత్రమే మణిపూర్ నుండి యాత్ర ను ప్రారంభించి ముంబై వరకు ప్రయాణించి దేశం మొత్తాన్ని ఒక్కటి చేసాడు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసాడు
దాంతో పాటు భారత రిజర్వేషన్ లు అలాగే రాజ్యాంగం కూడా మోడీ ప్రభుత్వం లో ఇప్పడు ప్రమాదం లో ఉన్నాయి
మహారాష్ట్ర లో కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకప్పుడు తెలంగాణా మహారాష్ట్ర నిజాం పాలనలో ఉండేవి అంటే ఒకే రాజ్యం లో ఉండేవి, కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ రావాలి అని కోరుకున్నట్టు చెప్పడం జరిగింది
కాంగ్రెస్ మాత్రమే ముస్లిం లను కాపాడుతూనే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ప్రభుత్వం లో భాగం చేస్తుంది
గాంధీ మోడీ ని కచ్చితంగా ఓడిస్తుంది అని కూడా ప్రసంగం లో చెప్పడం జరిగింది.
Leave a Reply