×
Donald trump in president elections and NO tax meeting,ఇన్కమ్ టాక్స్ రద్దు చేస్తా

ఇన్కమ్ టాక్స్ రద్దు చేస్తా – ట్రంప్

ఇన్కమ్ టాక్స్ రద్దు చేస్తా  ట్రంప్

అమెరికా లో అధ్యక్ష ఎన్నికలు ఇప్పడు ఆసక్తికరంగా మారిపోయాయి ముక్యంగా అమెరికన్లను ఆకట్టుకోవడానికి ఒకవైపు డోనాల్డ్ ట్రంప్ మరొకవైపు కమలా హారిస్ ప్రసంగాలు ఇస్తూ వెళ్తున్నారు

అందులో ఒకవేళ వాళ్ళను గెలిపిస్తే అమెరికన్లకు ఎలాంటి ప్రయోజనాలు అందిస్తాము అని చెప్పడం సహజంగానే జరుగుతుంది

కానీ అలా హామీలు ఇచ్చే ప్రవాహం లో డోనాల్డ్ ట్రంప్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు దీన్ని ఒకరకంగా హామీ అని కూడా అనుకోవొచ్చు

అదేంటంటే ట్రంప్ ని గెలిపిస్తే భవిష్యత్తు అమెరికా లో income tax అనేదే లేకుండా చేస్తా అని ప్రకటించాడు

ముందుగా income tax అనేది ప్రభుత్వానికి ఎందుకు కట్టాలి అనే ప్రశ్న వేసుకుంటే, income tax కట్టడం వల్ల ఆ డబ్బుతో ప్రభుత్వం మన కోసం రోడ్లను వేసి మంచి నీరు, కరెంటు సరఫరా తో పాటు మన కోసం మౌలిక సదుపాయాలు అన్ని కల్పిస్తుంది

అయితే మన ఇండియా లో మనం కట్టే tax తో పోలిస్తే మనకు అందే మౌలిక సదుపాయాలు చాలా తక్కువ దానికి ఉదాహరణ రోడ్ల విషయంలో కానీ

ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ప్రభుత్వ రవాణా వ్యవస్థ కానీ ఇలా చాలా సదుపాయాలతో లోపాలు ఉన్నాయి

సాధారణంగా మన ఇండియా లో 15 లక్షల కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళ దగ్గర నుండి 30% శాతం పన్ను వసూలు చేస్తారు
అమెరికా లో టాక్స్ అనేది మన ఇండియా కంటే ఎక్కువగా 37 శాతం గా ఉంది

వీటితోనే ప్రభుత్వాలు దేశాన్ని నడిపిస్తున్నాయి

ఇన్కమ్ టాక్స్ తీసేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది?

ఒకవేళ income టాక్స్ ని తీసేస్తే అప్పుడు మౌలిక సదుపాయాలు అందించడానికి ప్రభుత్వానికి డబ్బు ఎక్కడ నుండి వొస్తుంది దేశం ఎలా నడుస్తుంది అనే సందేహాలు వొస్తాయి

ఇక్కడ ట్రంప్ ఎం చెప్పదల్చుకున్నాడు అంటే, దేశం నడవడానికి అమెరికన్ల దగ్గర నుండి కాకుండా బయట దేశాల నుండి డబ్బు వసూలు చేస్తే సరిపోతుంది అని చెప్తున్నాడు

అదెలా అంటే ఉదాహరణకు ఇండియా చైనా లాంటి దేశాలు ఉత్పత్తి చేసే వస్తువులకు మంచి ధర లభించాలి అంటే ఎక్కువ మంది ధనవంతులు ఉండే పట్టణాలలో అమ్మితే డబ్బు ఎక్కువగా వొస్తుంది

అలాగే చైనా లాంటి దేశం లో ఉత్పత్తి అయ్యే వస్తువులు కూడా అమెరికా లో ఎక్కువగా అమ్మాలి అనుకుంటారు ఎందుకంటే అక్కడ ఎక్కువ డబ్బు ఇచ్చి కొంటుంటారు

కాబట్టి ఇక్కడ చైనా కి పెద్ద మొత్తం లో లాభం వొస్తుంది, అయితే ఇక నుండి అమెరికా లో వొస్తువులను అమ్మాలి అనుకునే దేశాల నుండి అదనపు సొమ్ము ను వసూలు చేయాలి

అప్పుడు అమెరికా లో వొస్తువులు అమ్ముకోవాలి అనుకునే ప్రతీ దేశం అమెరికాకి అదనపు tax కడుతుంది,

అప్పుడు అమెరికన్ల దగ్గర నుండి income tax వసూలు చేసే పరిస్థితి రాకుండా ఉంటుంది అనేది డోనాల్డ్ ట్రంప్ ఆలోచన

అయితే ఈ ఆలోచన అనేది అమెరికాలో ఒక ఆర్థిక విప్లవాన్ని తీసుకొస్తుంది అనుకోవాలి ఎందుకంటే ప్రజల దగ్గర టాక్స్ రూపంలో డబ్బు తీసుకోకపోతే చాలా మంది దగ్గర

ప్రతీ సంవత్సరం ఎక్కువ డబ్బు మిగులుతుంది

దాంతో వాళ్ళు ఎక్కువ కొనుగోళ్లు చేసే అవకాశం పెరుగుతుంది దానివల్ల అమెరికా లో ఎకానమీ కూడా పెరుగుతుంది,

అయితే ఈ ఆలోచన అనేది కొత్త కాదు మన ఇండియా లో కూడా సుబ్రహ్మణ్య స్వామి అనే రాజకీయ నాయకుడు ఎకనామిస్ట్ statistician
ఇండియా లో income టాక్స్ అనే concept ని రద్దు చేయాలి అని చెప్తూ ఉంటాడు

డోనాల్డ్ ట్రంప్ ఒకవేళ ఇలాంటి సిస్టం ని తీసుకొస్తే కొన్ని దేశాలు అమెరికా కి అదనపు టాక్స్ లేదా tarrif ను కట్టలేకపోవొచ్చు

ఉదాహరణకు:

మన భారత దేశం చాలా తక్కువగా అమెరికా తో వ్యాపారం చేస్తుంది ఈ tarrif సిస్టం వొస్తే అప్పడు మన ఇండియా దాన్ని కట్టలేకపోవొచ్చు
అప్పుడు మన ఇండియా కి అమెరికా స్పెషల్ స్టేటస్ ఇస్తే తప్ప మన వొస్తువులు అమెరికా లోకి అడుగుపెట్టలేవు ఎందుకంటే ఇండియా అంత tarrif ను కట్టలేకపోవొచ్చు

అలాగే ట్రంప్ ఆలోచన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కల్లోలానికి గురిచేసే అవకాశం ఉంది అని నిపుణులు కూడా చెప్తున్నారు

ఎందుకంటే ఇప్పటికే చైనా కి సంబంధించిన ఉత్పత్తులు అమెరికా లోకి రావాలి అంటే దానికి tarrif 60% నుండి 100% శాతం మధ్యలో పెట్టాలని ట్రంప్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది

అలాగే 2023 లో అమెరికా లోకి దాదాపు $3.8 trillion డాలర్ల విలువ గల ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి కాబట్టి వాటితో పోలిస్తే అమెరికా income tax ని
replace చేయాలి అంటే 70% శాతం tarrif లను అమలు చేయాలి అప్పడే income టాక్స్ లేకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థ మనగలుగుతుంది అని Alan Auerbach అనే California యూనివర్సిటీ కి చెందిన ప్రొఫెసర్ చెప్పడం జరిగింది

అలాంటప్పుడు అమెరికా లో ఉత్పత్తులు అమ్మడానికి మిగతా దేశాలు సిద్దపడకపోవొచ్చు దానివల్ల అమెరికా కి రాబడి తగ్గిపోతుంది దానివల్ల అక్కడ వొస్తువుల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది

కాబట్టి ట్రంప్ చెప్పిన ఆలోచన ఆచరణ లో సాధ్యం కాదు అని కూడా అయన అన్నారు

income టాక్స్ ను tarrif లతో భర్తీ చేయడం వల్ల దాని ప్రభావం ఎక్కువగా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వారి మీద పడుతుంది అని ఇంకొంతమంది నిపుణులు చెప్తున్నారు

ముక్యంగా అమెరికా లో వొస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి అప్పుడు ఆ భారం తప్పకుండ పేద వారి మీదనే పడుతుంది

కాకపోతే ట్రంప్ ఆలోచన టాక్స్ లను తగ్గించడం లో ఉండడం ఒక మంచి పరిమాణం అని ఒకవేళ ట్రంప్ గెలిస్తే పేదవారి మీద భారం పడకుండా టాక్స్ లను తగ్గిస్తే

అది కచ్చితంగా ట్రంప్ కు మంచి పేరు తీసుకొస్తుంది ఆ పరిణామం మిగతా దేశాల మిద కూడా తప్పకుండ ఉంటుంది

1 comment

Post Comment