ఇండియాకి కెనడాకి సంబంధాలు చెడిపోతున్నాయి
ఇండియాకి కెనడాకి సంబంధాలు చెడిపోతున్నాయి
కెనడా లో ఉంటున్న భారతీయుల్లో సిక్కులు ఎక్కువగా ఉంటారు అది ఎంతలా అంటే అక్కడ ఉన్న ఎంపీ సీట్లలో 17 సీట్లు అక్కడ సెటిల్ అయిన సిక్కులకు దక్కాయి
దాంతో సిక్కులు కెనడా ప్రభుత్వాన్ని పార్టీ ని ఎంతో కొంత ప్రభావితం చేసే స్థాయి లో ఉన్నారు
అయితే ఇండియా కి సిక్కులకు ఒక మధ్య ఎప్పటి నుండో ఒక వివాదం ఉంది అదేంటంటే సిక్కులు ప్రత్యేక దేశం కోరుతూ ఖలిస్థాన్ ఉద్యమాన్ని చేస్తున్నారు
దానికోసం అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ని కూడా చంపడం జరిగింది
అయితే కెనడా లో ఉంటున్న కొంత మంది సిక్కులు కెనడా నుండి ఇండియా కి ఆర్థికంగా ఆలోచనల పరంగా పంజాబ్ లో ఉన్న సిక్కులకు సహాయం చేస్తూ వాళ్ళతో ప్రత్యేక దేశం ఉద్యమాన్ని నడిపిస్తున్నారు
ఈ విషయాన్నీ తెలుసుకున్న ఇండియన్ ఇంటలిజెన్స్ వాళ్ళ మీద కెనడాలోని సీక్రెట్ గా ఆక్షన్ తీసుకుంటుంది
అయితే కెనడా ప్రైమ్ మినిస్టర్ కి తమ సొంత దేశం లో సిక్కులను భారత్ ఇబ్బంది పెట్టడం నచ్చడం లేదు
భారత్ కు సపోర్ట్ చేస్తే సిక్కుల ఓట్లు పోతాయి అనే ఉద్దేశ్యం తో కెనడా సిక్కులకు మద్దతుగా కెనడా ప్రభుత్వం మన ఇండియా తో వ్యవహరిస్తోంది
కెనడా సిక్కు ఖలిస్తాని హత్య
ఇటీవలే హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే కెనడా లో ఉంటున్న ఒక సిక్కు వ్యక్తిని హట్టాతుగా ఇద్దరు దుండగులు కాల్చి చంపేశారు
అయితే అతను ఖలిస్థాన్ దేశం ఏర్పాటుకు తోడ్పడుతున్న ఒక ఉగ్రవాదిగా భారత్ సూచించింది
అతను హఠాత్తుగా చంపబడం వెనుక భారత్ హస్తం ఉంది అని కెనడా ప్రధాని ఆరోపించాడు కానీ దీన్ని భారత్ ఖండించింది ఎలాంటి అధరాలు లేకుండా నిందించడం సరికాదు అని హెచ్చరించింది
అయితే కెనడా పోలీసులు ఇటీవలే ఒక ప్రెస్ మీట్ లో ఇండియా కి చెందిన లారెన్స్ బిష్ణోయ్ అనే మాఫియా రౌడీ తన గ్యాంగ్ తో కెనడా లో ఉంటున్న ఖలిస్థాన్ తీవ్రవాదులను చంపుతున్నట్టు పేర్కొన్నారు
అయితే బిష్ణోయ్ గ్యాంగ్ తో కలిసి భారత్ ఈ హత్యలు చేయిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి
ఇందులో కొసమెరుపు ఏంటంటే లారెన్స్ బిష్ణోయ్ అనే వ్యక్తి ఇప్పుడు గుజరాత్ లోని సబర్మతి జైలు లో ఉన్నాడు కాబట్టి ఒక నేరస్తుడు జైలు లో ఉండి క్రైమ్ చేయడం అనేది అసాధ్యం
కానీ అతని గ్రూప్ కెనడాలో హత్యలు చేస్తున్నట్టు కెనడా పోలీసులు నిర్దారించారు
కాబట్టి దీని వెనుక ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నట్టు అనుమానాలకు బలం చేకూరేలా ఉంది
అంటే ఇండియన్ ఇంటలిజెన్స్ అనేది బిష్ణోయ్ గ్యాంగ్ ని ఉపయోగించుకొని కెనడా లో ఉంటున్న ఖలిస్థాన్ వేర్పాటు వాదులను తుదముట్టిస్తున్నట్టు అర్ధం చేసుకోవొచ్చు
దీనికి సంబంధించి భారత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు
కానీ కెనడా ఇన్వెస్టిగేషన్ లో ఈ విషయం తేలినట్టు ఆ రిపోర్ట్ ను ఇండియన్ external అఫైర్స్ కి అందించగా దాన్ని కొట్టిపారేస్తూ
కెనడా కి సంబంధించిన దౌత్య వేత్తలను అక్టోబర్ 19 వ తేదీ అర్ధరాత్రి 12 గంటల లోపు దేశం విడిచి వెళ్ళిపోవాలి అని ఆదేశించింది
దాంతో పాటు కెనడా లో ఉంటున్న మన భారతీయ దౌత్యవేత్తలను వెంటనే ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది
అంటే అక్కడ నుండి ఇండియా కి తిరిగి రప్పిస్తుంది
ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య తొందర్లోనే ట్రేడింగ్ పరంగా ఆంక్షలు అమలు అయ్యేలా కనిపిస్తున్నాయి
ముక్యంగా భారత్ కెనడా లో చేస్తున్న క్రైమ్ ని కెనడా సహించడం లేదు దానికి ఇండియా తో వ్యాపార పరంగా కొన్ని ఆంక్షలు విధించేలా పరిస్థితులు ఉన్నాయి అని కెనడా చెప్తుంది
దీని మీద తుది నిర్ణయం తొందర్లోనే తీసుకుంటాం అని కెనడా ప్రకటించింది
1 comment