ఎట్టకేలకు ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు

unkown
3 Min Read

ఎట్టకేలకు ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది అక్టోబర్ 26 శనివారం ఉదయం ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క రాజధాని టెహ్రాన్ నగరం మీద దాడులు మొదలుపెట్టింది,

Iran attack on Israel

అక్టోబర్ 1 న ఇరాన్ ఇజ్రాయెల్ మీద ballistic missile తో దాడి చేసింది అందుకు ప్రతి చర్యగా సరిగ్గా 25 రోజుల తరువాత ఇజ్రాయెల్ ప్రతి దాడి చేసింది, అందులో 20 టార్గెట్ లను ఛేదించాం అని ఇజ్రాయెల్ చెప్తుంది,

ముక్యంగా సైనిక స్థావరాల మీద చాలా ఖచ్చితత్వం తో దాడులు చేసాం అని ఆ దాడులు 3 వేవ్స్ లో ఉంటాయి అని అందులో మొదటి విడత దాడులు ఉదయం 5 గంటల లోపే ముగించాం అని ఇజ్రాయెల్ ప్రకటించింది

కానీ టెహ్రాన్ లోని ప్రజలు ఉదయం 6 గంటల తరువాత పేలుడు శబ్దాలు విన్నాం అని చెప్తున్నారు, ఇరాన్ మిలిటరీ కూడా ఈ దాడిలో మాకు పెద్దగా నష్టం లేదు అని చెప్తుంది

కానీ ఇజ్రాయెల్ అధికారికంగా చేసిన ప్రకటన లో ఇరాన్ లో ముక్యంగా మిస్సైల్స్ ని తయారుచేసే మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ లో దాడులు నిర్వహించాం అని ఇజ్రాయెల్ చెప్తుంది,

ఇరాన్ గత సంవత్సరం నుండి ఇజ్రాయెల్ మీద చేస్తున్న మిస్సైల్స్ దాడులలో చాలా వరకు ఇక్కడే తయారుచేసారు అందుకే ఇజ్రాయెల్ ని కాపాడుకోవడానికి ఆ మిస్సైల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద దాడి నిర్వహించాం అని చెప్తుంది

iran people supporting israel by showing placard of iranians stand with israel,
ఎట్టకేలకు ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది

ఇరాన్ ప్రజల హర్షం

అయితే ఆశ్చర్యం ఏంటంటే ఇరాన్ లో దాడులు జరుగుతుండగా ఇరాన్ ప్రజలు సంతోషం తో ఉన్నారు, దానికి కారణం ఏంటంటే ఇరాన్ ప్రజలు అక్కడ ఆడవారు ఇరాన్ నియంతృత్వ పాలన పై ఆగ్రహం తో ఉన్నారు

ముక్యంగా ఇస్లాం నిబంధనలతో విసిగిపోయి ఇస్లాం కి వ్యతిరేఖంగా ఉద్యమాలు చేస్తున్నారు, anti హిజాబ్ ఉద్యమం తో ఈ ఇస్లాం వ్యతిరేక ఉద్యమం పురుడు పోసుకుంది

అందుకే ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేస్తున్న దాడి కేవలం ఇస్లాం మీద చేస్తుంది తప్ప ఇరాన్ ప్రజల మీద కాదు అని అక్కడ ప్రజలు ఇలా ప్లకార్డు లు పట్టుకొని ప్రకటిస్తున్నారు

ఇజ్రాయెల్ కూడా ఇరాన్ ప్రజల మీద కాకుండా కేవలం మేము ఇరాన్ సైనిక స్థావరాల మీద నే దాడి చేసాం అని చెప్తుంది

అయితే ఈ దాడి కేవలం ఒక ప్రతిచర్య గా మాత్రమే కనిపిస్తుంది అంటే ఇజ్రాయెల్ గాజా లో లెబనాన్ లో చేసినట్టు బీకరమైన దాడులు చేసినట్టుగా లేదు అంటే లెబనాన్ లో hezbollah ని పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా దాడులు చేసింది

గాజా ని నామరూపాలు లేకుండా చేసింది వాటితో పోలిస్తే ఇరాన్ మీద చేసిన దాడులు చాలా చిన్నవి

ఎందుకంటే ఇరాన్ మీద చేసే దాడులు పూర్తిస్థాయి యుద్దానికి దారి తీస్తాయి ముక్యంగా ఇరాన్ కు మద్దతుగా రష్యా యుద్ధం లో పాల్గొంటుంది అప్పుడు మరోవైపు ఇజ్రాయెల్ కి మద్దతుగా అమెరికా రంగం లోకి దిగుతుంది

ఈ పరిణామాలన్నీ మూడోవ ప్రపంచం యుద్దానికి దారి తెస్తాయి అందుకే ఇజ్రాయెల్ పెద్ద స్థాయి లో ఇరాన్ మీద దాడులు చేయడం లేదు
కేవలం ఇజ్రాయెల్ మీద దాడి చేసే మిస్సైల్ ల తయారీ గోడౌన్ లను సైనిక స్థావరాలను మాత్రమే ధ్వంసం చేసింది

ఒక వేళ దీనికి ప్రతి చర్యగా ఇరాన్ కూడా మళ్ళి దాడులు చేస్తే అప్పడు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని ఇజ్రాయెల్ హెచ్చరించింది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *