Current Affairs in Telugu.com

పుతిన్ చేతిలో డాలర్ ని తొక్కేసే కరెన్సీ

పుతిన్ చేతిలో డాలర్ ని తొక్కేసే కరెన్సీ

రష్యా లో BRICS సదస్సు విజయవంతంగా జరిగింది అయితే అందులో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది,

BRICS కూటమి డాలర్ కు ప్రత్యామ్నాయంగా దాని సొంత కరెన్సీ ని చూపించింది, దాన్ని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఆ నోటు ను పట్టుకున్నారు

ఆ నోటులో 5 దేశాల జాతీయ జెండాలు వారి భాషలు సంస్కృతి చిహ్నాలు ప్రతిబింబించేలా దాన్ని రూపొందించారు,
అయితే ఇది అధికారికంగా జరిగింది కాదు కేవలం ఆ సదస్సు లోని రష్యా కి చెందిన కొంతమంది అధికారులు ఆ నోటును పుతిన్ చేతికి ఇచ్చారు
ఆ డిజైన్ పుతిన్ కు నచ్చినట్టు తెలుస్తుంది,

పుతిన్ చేతిలో డాలర్ ని తొక్కేసే కరెన్సీ
brics currency

ఈ కరెన్సీ ని రాబోయే రెండేళ్లలో తప్పకుండ తీసుకొస్తారని తెలుస్తుంది ఎందుకంటే దీనికి సంబందించిన నోట్లను రష్యా అధికారులు స్వయంగా సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు,

అంటే దీన్ని తొందర్లోనే తీసుకొస్తారని అనుకోవొచ్చు లేదంటే వెస్ట్ దేశాలకు డాలర్ ని రిజెక్ట్ చేస్తున్నాం అనే సందేశాన్ని పంపడానికి కూడా పుతిన్ ఇలా చేసి ఉండొచ్చు

భారత ప్రధాని ముందు నుండి అంతర్జాతీయ వ్యాపారం అనేది ఆయా దేశాల సొంత కరెన్సీ లో జరగాలి చెప్తూ వొస్తున్నారు దాంట్లో భాగంగా ఇప్పటికే రష్యా తో ఇండియా సొంత కరెన్సీ లోనే ట్రేడింగ్ చేస్తుంది,

యురోపియన్ దేశాల సొంత కరెన్సీ

అలాగే యురోపియన్ యూనియన్ లో ఉన్న దేశాలు డాలర్ కి బదులుగా euro కరెన్సీ ని ఉపయోగిస్తున్నాయి

ఈ విధానాన్ని ఇప్పుడు BRICS లో ఉన్న అన్ని దేశాలు పాటించాలి అని సూచించింది, దాని వల్ల డాలర్ మీద ఆధారపడడం తగ్గుతుందని రష్యా తెలిపింది
రష్యా ఉక్రెయిన్ మీద చేస్తున్న యుద్దానికి ఫలితంగా దాని మీద westren దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే అందుకు గాను ఈ బ్రిక్స్ సదస్సు ను
రష్యా ఉపయోగించుకొని తమ మీద ఉన్న ఇంటర్నేషనల్ ట్రేడ్ బ్యాన్ కి ప్రత్యామ్నాయాన్ని బలపరచాలి అనుకుంటుంది,
అంటే రష్యా ఇప్పడు డాలర్ ని ఉపయోగించి అంతర్జాతీయ ట్రేడ్ చేయడానికి వీళ్లేదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయాన్ని కనుక్కొని సొంత కరెన్సీ లో trade చేయాలి అనుకుంటుంది కానీ దానికి మిగతా దేశాలు సిద్ధంగా ఉండాలి
అందుకు ఈ బ్రిక్స్ సదస్సు అనేది చాలా ఉపయోగపడుతుంది ఇందులో ఉన్న దేశాలకు సొంత కరెన్సీ లో ట్రేడ్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో వివరించి వాళ్ళని ఒప్పిస్తే రష్యా కి ఇబ్బందులు తప్పుతాయి

అలా అని డాలర్ వ్యవస్థను పూర్తిగా రిజెక్ట్ చేయబోము అని కూడా రష్యా చెప్తుంది కాకపోతే ఒక independence ఎకనామిక్ సిస్టం ని నిర్మించాలి అనుకుంటున్నట్టు తెలుస్తుంది

ముక్యంగా ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్న The Society for Worldwide Interbank Financial Telecommunication (Swift) సిస్టం కి బదులుగా రష్యా కొత్త సిస్టం ని తయారుచేయాలి అనుకుంటుంది,

ఎందుకంటే ఒక వ్యక్తి అమెరికా లో ఉన్న వ్యక్తికి డబ్బు పంపియాలి అనుకుంటే దానికి అతను swift సిస్టం ద్వారానే డబ్బులు పంపియాల్సి ఉంటుంది ప్రపంచ బ్యాంకులు అన్ని కూడా

అదే వ్యవస్థను అలవరుచుకున్నాయి కాబట్టి దీని నుండి బైటికి రావడమే రష్యా ఉద్దేశ్యంగా పెట్టుకుంది

కెనడా లో హిందువుల మీద దాడి- ఖలిస్తానీలు

Exit mobile version