Current Affairs in Telugu.com

BRICS ఈసారి యుద్ధభూమి రష్యాలో

BRICS ఈసారి యుద్ధభూమి రష్యాలో

16 వ BRICS 2024 సదస్సు ఈ సారి యుద్ధభూమి రష్యా లో జరుగుతుంది , దానికి మన ప్రధాన మంత్రి రష్యా లో ఉన్న కజన్ అనే సిటీ కి బయలుదేరి వెళ్లారు,

ఈ సిటీ ముక్యంగా రెకా ఖాజాన్కా మరియు వోల్గా అనే నదుల మధ్య ఉన్న పట్టణం

ఈ సదస్సు అక్టోబర్ 22, 23, 24 మూడు రోజులు జరగబోతుంది ,అయితే BRICS సదస్సు ప్రాధాన్యం ఏంటి?

ఇది ఎందుకు జరుగుతుంది అని మాట్లాడుకుంటే BRICS అనేది 5 దేశాల కలయిక లో ఉన్న కూటమి,

Brazil, Russia, India, China, South Africa వీటన్నిటిని కలిపి BRICS గా పిలుస్తారు అయితే ఇప్పుడు ఈ కూటమి లో 10 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి,

ఈ సారి ఇంకా ఎక్కువ దేశాలు కలిసే అవకాశం ఉంది

అయితే ఈ సదస్సు ముఖ్య ఎజెండా ఏంటి అంటే ఈ దేశాలు అన్ని కలిసి వాణిజ్య పరంగా ఆర్థికపరంగా ,

పర్యావరణం ఇలాంటి అంశాల మీద చర్చలు జరిపి ఒకరికి ఒకరు తోడ్పాటు అందించుకునే కూటమి ఇది,

ఈ సదస్సులో దేశాలు వాటి సంస్కృతి ని ప్రమోట్ చేసుకోవడం దాంతో పాటు రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు డెవలప్ చేయడం లాంటివి జరగబోతున్నాయి,

అందులో భాగంగా రష్యా లో మన ఇండియన్ మూవీస్ ని కల్చర్ ని ప్రమోట్ చేయాలి అని రష్యా అధినేత పుతిన్ చర్చించబోతున్నారు

దాంతో పాటు economic partnership, అంటే దేశాల మధ్య నిబంధనలు లేని వ్యాపారం, పెట్టుబడులు పెట్టుకోవడం, సర్వీసెస్ అందించుకోవడం,

cooperation in science and innovation సైన్స్ లో జరిగే కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి మేధావులను ఆయా దేశాల నుండి పొందడం వాళ్ళతో కలిసి పనిచేయడం లాంటివి

అయితే ఈ సారి ఇందులో కొన్ని కీలకమైన చర్చలు జరిగే అవకాశం ఉంది ముక్యంగా 2 సంవత్సరాల నుండి జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ వార్ గురించి,

అలాగే ఇరాన్ కూడా ఇందులో ఉంది కాబట్టి ఇజ్రాయెల్ ఇరాన్ తో చేస్తున్న యుద్ధం గురించి చర్చకు వొచ్చే అవకాశం ఉంది

దాంతో పాటు భవిష్యత్తు టెక్నాలజీ లో చైనా ముందు ఉంది అని అందరికి తెలుసు ఆ టెక్నాలజీ ని మిగతా దేశాలకు ఇచ్చే చర్చలు కానీ గ్లోబల్ ట్రేడింగ్ లో డాలర్ వినియోగాన్ని తగ్గించే విషయం లో

healthcare స్పేస్ టెక్నాలజీ ని పంచుకొని BRICS లో ఉన్న దేశాలు అభివృద్ధి చెందొచ్చు అనే విషయాలు చర్చింది ఒకరికి ఒకరు తోడ్పాటు అందించుకోవడమే ఈ BRICS ముఖ్య ఉద్దేశ్యం

BRICS ఈసారి యుద్ధభూమి రష్యా లో

ఈ సంవత్సరం ఎందుకు స్పెషల్

పుతిన్ మీద ఇంటర్నేషనల్ అరెస్ట్ వారెంట్ ఉండడం వల్ల చివరి సంవత్సరం సౌత్ ఆఫ్రికా లో జరిగిన బ్రిక్స్ సదస్సుకు పుతిన్ హాజరు కాలేకపోయాడు

కానీ ఈ సంవత్సరం ఈ సదస్సును స్వయంగా పుతిన్ ఏ హోస్ట్ చేయబోతున్నాడు

బాంగ్లాదేశ్ లో కరెంటు కట్ – అదానీ

Exit mobile version