పాకిస్తాన్ రైల్వేస్టేషన్ లో బాంబు పేలుడు

unkown
2 Min Read

పాకిస్తాన్ రైల్వేస్టేషన్ లో బాంబు పేలుడు

పాకిస్తాన్ situation ఎలా ఉంది అంటే కాశ్మీర్ కోసం మన ఇండియా లో తీవ్రవాదుల ద్వారా అటాక్స్ చేస్తుంటే ఇంకోవైపు అదే పాకిస్తాన్ లో
బలూచిస్తాన్ అనే సెపరేట్ దేశం కోసం వాళ్ళు పాకిస్తాన్ లో అటాక్స్ చేస్తున్నారు

ఇక్కడ ఇంటరెస్టింగ్ థింగ్ ఏంటంటే పాకిస్తాన్ కోరుకుంటున్న కాశ్మీర్ కంటే పాకిస్తాన్ నుండి విడిపోవాలి అనుకుంటున్న బలూచిస్తాన్ సైజు చాలా పెద్దది,

అది ఎంత పెద్దది అంటే పాకిస్తాన్ దేశం లో 44% ల్యాండ్ ఈ బలూచిస్తాన్ దే ఉంటుంది
దీన్ని బట్టి మీరే అర్ధం చేసుకోండి ఒకవేళ పాకిస్తాన్ బలూచిస్తాన్ ని కోల్పోతే అది ఎంత చిన్నది అవుతుందో

అయితే ఈ బలూచిస్తాన్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో Quetta అనే సిటీ ఉంది ఇక్కడ దాదాపు 1.5 మిలియన్ కంటే ఎక్కువమంది నివసిస్తారు,

అది పాకిస్తాన్ లో 10 వ అతిపెద్ద నగరం అని చెప్పుకోవొచ్చు అయితే ఈ నగరం లో ఉన్న రైల్వే స్టేషన్ లో November 9 వ తేదీన అతిపెద్ద బ్లాస్ట్ జరిగింది,

ఇందులో దాదాపు 25 మంది చనిపోయారు అందులో 14 మంది పాకిస్తాన్ ఆర్మీ ఉన్నారు,

ఈ వీడియో లో బ్లాస్ట్ ఎలా జరిగిందో రికార్డు అయ్యింది

ఈ ఎటాక్ చేసింది మేమె అని Baloch Liberation Army ప్రకటించుకుంది ఈ ఆర్మీ ఏంటంటే బలూచిస్తాన్ ప్రత్యేకదేశమ్ కోసం పోరాడే ఒక ఎంటిటీ, అంటే పాకిస్తాన్ దృష్టిలో తీవ్రవాదులు అని చెప్పుకోవొచ్చు

అయితే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ సొంత ప్రావిన్స్ లో ఎందుకు ఎటాక్ చేసింది వేరే province లో చెయ్యొచ్చు కదా అనే అనుమానాలు వొస్తాయి

సో మేటర్ ఏంటంటే వాళ్ళు కావాలనే పాకిస్తాన్ ఆర్మీ ని టార్గెట్ చేసి ఆ బ్లాస్ట్ చేసారు అది కూడా అక్కడ చనిపోయిన ఆర్మీ వాళ్ళు ఇప్పుడే వాళ్ళ ట్రైనింగ్ ని కంప్లీట్ చేసుకొని

ఫ్రెష్ గా బైటికొచ్చిన ఆర్మీ సో అందుకే వాళ్ళని టార్గెట్ చేసి ఎటాక్ చేశారు
దీనికి సంబందించిన పూర్తి డీటెయిల్స్ మీడియా కి రిలీజ్ చేస్తాం అని కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన పోస్ట్ లో చెప్పుకొచ్చింది

అయితే ఇది ఒక సూసైడ్ బాంబర్ ఎటాక్ అని తెలుస్తుంది అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుండి ఒకరు బాంబు లను కట్టుకొని రైల్వే స్టేషన్ లోకి ఎంటర్ అయ్యి తనను తాను బ్లాస్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది

దీని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాల్సివుంది అని పాకిస్తాన్ చెప్తుంది దాంతో పాటు 46 మందికి పైగా గాయ పడ్డారు అని తెలుస్తుంది,

ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడ 100 మంది ఉన్నట్టుగా అంచనా

తుపాకీ పట్టుకున్నవాడు అదే తుపాకీకి బలి అవుతాడు అన్నట్టుగా పాకిస్తాన్ భారత్ మీద చేసిన ఉగ్రవాదం ఇప్పుడు అదే పాకిస్తాన్ లో పుట్టి
ఆ దేశ ఉనికినే ప్రమాదం లోకి నెడుతుంది.

 

ట్రంప్ నిఘా సంస్థ అధికారం ఒక హిందువుకు

FacebookTelegramWhatsAppCopy LinkShare
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version