హిందువులను రక్షిస్తా – డోనాల్డ్ ట్రంప్
హిందువులను రక్షిస్తా – డోనాల్డ్ ట్రంప్
హిందువులను రక్షిస్తా అని అమెరికా ఎలక్షన్స్ లో భాగంగా ట్రంప్ తన ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు
అమెరికా లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ చాలా ఆసక్తికరంగా మారిపోయాయి
అందులో భాగంగా డోనాల్డ్ ట్రంప్ హిందువుల మీద ఇంకొన్ని ఆసక్తికరమైన వాక్యాలు చేసాడు
నేను ఒకవేళ అధికారంలో ఉండి ఉంటె బాంగ్లాదేశ్ లో హిందువుల మీద క్రిస్టియన్ల మీద అరాచకాలు జరగనిచ్చేవాడిని కాదు అని
కమలా హారిస్, జో బైడెన్ అమెరికన్ హిందువులను అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులను మర్చిపోయారు అని హిందువుల రక్షణ గురించి అస్సలు ఆలోచించలేదు,
అలాగే ఇజ్రాయెల్ యుద్ధం తో పాటు యుక్రెయిన్ యుద్ధం జరగడానికి జో బైడెన్ కారకులు అని ట్రంప్ వాళ్ళ మీద విమర్శలు గుప్పించాడు
ముక్యంగా అమెరికా లో మతానికి వ్యతిరేకంగా పెరుగుతున్న శక్తుల నుండి అమెరికన్ హిందువులను కాపాడుతాను అని వాళ్ళ స్వేచ్ఛ కోసం పోరాడుతాను అని, నా పరిపాలనలో ఇండియా తో సంబంధాలు ఇంకా మెరుగుపడతాయి ఎందుకంటే మోడీ నా మిత్రుడు కాబట్టి.
ఒకవేళ కమలా హరీష్ గెలిస్తే అమెరికా లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న భారతీయుల మీద regulations పెట్టి taxes విపరీతంగా పెంచుతుంది కానీ నేను గెలిస్తే టాక్స్ ను కట్ చేసి అమెరికా ఎకానమీ ని మళ్ళి తిరిగి బలంగా నిర్మిస్తాను అని ట్రంప్ చెప్పుకొచ్చాడు
ట్రంప్ వ్యూహం
ఇదంతా చూస్తుంటే అమెరికా లో ఎక్కువగా ఉంటున్న భారతీయులను అందులోను హిందువులను ఆకట్టుకోవడానికి ట్రంప్ హిందువులను రక్షిస్తా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడు అని అర్ధం అవుతుంది
ఎందుకంటే 2020 లెక్కల ప్రకారం అమెరికా లో దాదాపు 2.5 మిలియన్ హిందువులు నివసిస్తున్నారు ఆ సంఖ్య 2024 కు పెరిగే ఉంటుంది
దాంతో పాటు అనుకున్నట్టుగానే జో బైడెన్ అధికారం లో ఉన్నప్పుడు బాంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరిగినప్పుడు అమెరికా పట్టించుకోలేదు
అమెరికన్ హిందువులు వైట్ హౌస్ ఎదురుగా నిరసన తెలియజేసినా కూడా బైడెన్ ప్రభుత్వం స్పందించలేదు
బాంగ్లాదేశ్ లో ఉన్న ప్రస్తుత లీడర్ మొహమ్మద్ యూనుస్ జో బైడెన్ కు అనుకూలమైన వ్యక్తి, ఒకవేళ కమలా హరీష్ అధికారం లోకి వొస్తే అప్పుడు మొహమ్మద్ యూనుస్ మరింత బలంగా మారిపోయి హిందువుల మీద దాడులు తీవ్రతరం అవుతాయి హిందువుల మీద అరాచకాలు చేసినా ఎవ్వరూ పట్టించుకోరు,
అందుకే డోనాల్డ్ ట్రంప్ కి వోట్ వేయాలి అని ట్రంప్ మాత్రమే హిందువులను రక్షిస్తాడు అని అమెరికా లో ని హిందువుల మధ్య ప్రచారం కూడా జరుగుతుంది
ఇప్పటికీ బాంగ్లాదేశ్ లో హిందువుల మీద మిగతా మైనారిటీ ల మీద బాంగ్లాదేశ్ ఆర్మీ దాడులు చేస్తుంది కొంతమంది ప్రముఖ హిందువుల మీద ఆంక్షలు కూడా విధించింది
2024 అక్టోబర్ 26 న బాంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ సిటీ లో The Sanatan Jagran Manch పేరుతో వేలాది మంది హిందువులు ఒకేదగ్గరికి చేరి నిరసనలు తెలియజేసారు, బాంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న అరాచకాలను ఆపేయాలని కొన్ని డిమాండ్స్ ని తీసుకొచ్చారు
DEMANDS ఏంటంటే ?
1 బాంగ్లాదేశ్ లోని మైనారిటీ లను ప్రొటెక్ట్ చేయడానికి minority protection law ను అమలు చేయాలి
2 ministry of minority affairs మైనారిటీ ల కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ వ్యవస్థను ఏర్పాటు చేయాలి
3 మైనారిటీ ల మీద జరిగిన నేరాలను వేగంగా కోర్టులో విచారణ జరిపి న్యాయం అందించాలి
4 బాధితులకు తగిన పరిహారం ఇప్పించాలి
5 హిందూ బుద్దిస్ట్ క్రిస్టియన్ ట్రస్ట్ లను కాపాడాలి
6 కూలగొట్టిన మందిరాలను తిరిగి నిర్మించాలి
వీటితో పాటు బాంగ్లాదేశ్ లో సంస్కృతం మరియు పాళీ బాషలలో విద్యా బోధన జరపడానికి బోర్డు లను ఏర్పాటు చేసి దుర్గా మాత పూజకు 5 రోజులు అధికారికంగా సెలవు ప్రకటించాలి అని డిమాండ్ చేసారు
ఈ డిమాండ్లను విన్న environment minister Syed a Rizwana Hasan
అందులో దుర్గామాత పూజ కోసం 2 రోజులు సెలవు ప్రకటించాడు ఇలా రెండు రోజులు సెలవు ఇవ్వడం బాంగ్లాదేశ్ చరిత్ర లో మొదటిసారి
అని బాంగ్లాదేశ్ హిందువులు చెప్తున్నారు
షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిపోయినప్పటి నుండి మైనారిటీ ల మీద జరుగుతున్న అరాచకాలు దాడులకు వ్యతిరేకంగా హిందువులు చేసిన అతి పెద్ద ప్రొటెస్ట్ ఇదే అక్టోబర్ 26 న జరిగింది.
1 comment